జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం పాట
http://www.youtube.com/watch?v=ZeY4dOSxF-E
Wednesday, December 30, 2009
Sunday, December 27, 2009
Jaya Jayahe Telangana Janani Jaya kethanam Song (Telangnans Songs)
జయ జయహే తెలంగాణా జననీ జయ కేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటై న చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణా జై జై తెలంగాణా
జై తెలంగాణా జై జై తెలంగాణా
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండరగండడు కొమురంభీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల, కాంతి రేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగే చార్మినార్
జై తెలంగాణా జై జై తెలంగాణా
జై తెలంగాణా జై జై తెలంగాణా
జానపద జనజీవన జావళీలు జాలువార
కలిగాయక వైతాళిక కళల మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాల జనజాతర
అనునిత్యం నీగానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణా జై జై తెలంగాణా
జై తెలంగాణా జై జై తెలంగాణా
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువునా ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వన సంపద, సక్కనైన పువ్వుల పొద
సిరులుపండే సారమున్న మాగానియే కధ నీ యెద
జై తెలంగాణా జై జై తెలంగాణా
జై తెలంగాణా జై జై తెలంగాణా
గోదావరి కృష్ణమ్మలు మన భీళ్లకు మల్లాలే
పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలె
సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె
జై తెలంగాణా జై జై తెలంగాణా
జై తెలంగాణా జై జై తెలంగాణా
Thursday, December 24, 2009
Sunday, December 20, 2009
Saturday, December 19, 2009
Thursday, December 10, 2009
Subscribe to:
Posts (Atom)